HomeTelugu news

మాజీ మంత్రి మాణిక్యాల రావు కరోనాతో కన్నుమూత
Published By :  Lasya Raghavaraju Image Image
Former Minister Manikyala Rao passed away due to Corona
Saturday Aug 01, 2020
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మరో రాజకీయ నాయకుడిని బలి తీసుకుంది. సీనియర్ బీజేపీ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు కరోనాతో కన్నుమూశారు. ఆయన వయసు 60 సంవత్సరాలు. మాణిక్యాలరావుకు కరోనా రావడంతో నెల రోజులుగా విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు కన్నుమూసినట్టు వైద్యులు ప్రకటించారు.

పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మాణిక్యాలరావు 2014 ఎన్నికల్లో తొలిసారి బీజేపీ తరఫున పోటీ చేసి తాగేప‌ల్లిగూడెం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తొలి ప్ర‌య‌త్నంలోనే అప్పటి టీడీపీ ప్రభుత్వంలో దేవాదాయశాఖ మంత్రిగా పనిచేశారు. 2014 నుంచి 2018 వరకు మంత్రిగా కొనసాగారు.  

మాణిక్యాల‌రావు ఫోటో గ్రాఫ‌ర్‌గా కెరీర్ ప్రారంభించి మంత్రిగా ఎదిగారు.  స్వతహాగా స్వయంసేవక్ గా ఆర్ఎస్ఎస్‌లో చురుకుగా పనిచేస్తూ 1989లో బీజేపీలో చేరి అంచెలంచెలుగా జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షులుగా పార్టీ కి పలు సేవలు అందించారు.

   Politics

   Lifestyle