HomeTelugu news

విశాఖ షిప్‌యార్డులో భారీ క్రేన్‌ కూలి 10 మంది మృతి
Published By :  Lasya Raghavaraju Image Image
Ten crushed to death after huge crane collpases in Vizag ship yard
Saturday Aug 01, 2020
విశాఖపట్నం షిప్‌యార్డులో ఘోర ప్రమాదం జరిగింది.  హిందూస్థాన్‌ షిప్‌ యార్డులో భారీ క్రేన్‌ కుప్పకూలి 10 మంది కూలీలు మృతి చెందారు. క్రేన్‌ కింద మరికొందరు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.  క్రేన్‌ను తనిఖీ చేస్తుండగా అది ఒక్కసారిగా విరిగిపడింది. 

ఈ ప్రమాదంలో నలుగు అక్కడికక్కడే చనిపోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సహాయక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రికో మరో ఆరుగురు మరణించినట్లు సమాచారం. క్రేన్ శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు.  ఇక క్రేన్‌ను తొలగించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఘటనపై హిందుస్తాన్ షిప్ యార్డు ఇంతవరకు స్పందించలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ తర్వాత విశాఖలో తరచూ ప్రమాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. 

   Politics

   Lifestyle