HomeTelugu news

జూనియర్ పాండ్యా భలే ముద్దోస్తున్నాడే
Published By :  Lasya Raghavaraju Image Image
Hardik Pandya shares first glimpse photo of his newborn son
Saturday Aug 01, 2020
భారత క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తన కొడుకును సోషల్ మీడియా వేదికగా ప్రపంచానికి పరిచయం చేసాడు. పాండ్యా  ప్రియురాలు, సెర్బియా నటి నాటా స్టాంకోవిచ్ మొన్న పండంటి బాబుకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. పుట్టిన రోజు నాడు బాబు వేలు పట్టుకుని తీయించుకున్న ఫొటోను పాండ్యా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తాజాగా తన కొడుకుని చేతిలోకి తీసుకున్న ఫొటోను పంచుకున్నాడు. 

పుత్రోత్సాహంలో మునిగి  తేలుతున్న పాండ్యా ఆ ఫోటోకి  ‘దేవుడిన కానుక’ అని క్యాప్షన్ పెట్టాడు. చిన్న పాండ్యా చాలా ముద్దొచ్చేలా ఉన్నాడని, అచ్చం తల్లి పోలికేనని అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. 

26 ఏళ్ల పాండ్యా, నటాషా ఈ ఏడాది తొలి రోజున దుబాయ్‌లో నిశ్చితార్థం చేసుకున్నాడు. అయితే పెళ్లి కాకముందే మే 31న తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చాడు. ఇక పాండ్యా తన తండ్రి బాధ్యతలు చెప్పటి కొత్తగా పుట్టిన బిడ్డ కోసం ''బేబీ డైపర్స్'' తీసుకెళ్తున్న విషయాన్ని కూడా సోషల్ మీడియాలో తెలిపాడు.  

   Politics

   Lifestyle