HomeTelugu news

టిక్ టాక్ సహా 59 చైనా యాప్స్‌ పై నిషేధం
Published By :  Lasya Raghavaraju Image Image
Central government bans 59 Chinese apps including TikTok
Tuesday Jun 30, 2020
భారత్-చైనా సరిహద్దు వివాదంతో చైనా వస్తువులను నిషేదించాలని సోషల్ మీడియాలో ‘బాయ్‌కాట్ చైనా’నినాదం ట్రెండ్ అవుతున్న క్రమంలో కేంద్రం టిక్ టాక్ ఆప్ పై నిషేధం విధించింది. భారతదేశ సార్వభౌమాధికారం సమగ్రత, దేశ యొక్క రక్షణ, భద్రత దృష్ట్యా టిక్ టాక్ సహా 59 చైనీస్ యాప్స్‌పై నిషేధిస్తున్నట్లు పేర్కొంది.  లైకీ, క్లబ్ ఫ్యాక్టరీ, యూసీ బ్రౌజర్, షేర్ ఇట్, హెలో, వైబో, డియూ క్లీనర్, డియూ బ్రౌజర్, యూ వీడియో తదితర 59 యాప్‌లను కేంద్రం నిషేధించింది.

గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుండి నిషేధించిన యాప్స్ ను తొలగించాయి. నిన్న ఈ యాప్‌లపై బ్యాన్ విధించిన కేంద్రం... వీటిని గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి తొలగించాలని యాపిల్, గూగుల్‌కు సమాచారం అందించింది. వీటితో పాటు పలు టెలికాం కంపెనీలకు సైతం తమ ఆదేశాలు పాటించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో భారత్‌కు సంబంధించిన తమ ప్లే స్టోర్స్‌లో టిక్‌టాక్‌ను తొలగించాయి యాపిల్, గూగుల్. దీంతో ఇకపై వినియోగదారులు వాటిని డౌన్‌లోడ్ చేసుకోవడం సాధ్యంకాదు. 

కాగా, జూన్ 15న లడక్ గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్రం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. చైనా సైనికులు బలగాల ఉపసంహరణ సమయంలో కుట్రపూరితంగా వ్యవహరించి 20 మంది భారత జవాన్లను హతమార్చారు. 17 మంది చైనా సైనికుల మృతదేహాలను భారత్ అప్పగించింది. అంతేకాదు తాము బందీగా పట్టుకున్న చైనా కల్నల్‌ను కూడా భారత్ విడుదల చేసింది. అయితే చైనా మాత్రం తమ సైనికుల మరణాలపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. 

   Politics

   Lifestyle