HomeTelugu news

విశాఖ సాయినార్‌ లైఫ్‌ సెన్సైస్‌ ఫార్మాలో గ్యాస్ లీక్ ఇద్దరు మృతి
Published By :  Lasya Raghavaraju Image Image
Two dead after benzimidazole gas leak at Sainor Life Sciences
Tuesday Jun 30, 2020
విశాఖపట్నంలోని పరవాడలో సాయినార్‌ లైఫ్‌ సెన్సైస్‌ ఫార్మా కంపెనీలో సోమవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన గ్యాస్ లీకేజీ ప్రమాదంలో ఇద్దరు మరణించగా మరో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సాయినార్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ కంపెనీ (Sainor Life Sciences)లో రియాక్టర్ నుంచి బెంజిన్ గ్యాస్ లీక్ లీకైంది. ఈ ఘటనలో కంపెనీలో షిఫ్ట్ ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్న నరేంద్ర, కెమిస్ట్ గౌరీశంకర్ మృతిచెందారు. అస్వస్థతకు గురైన నలుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వారికి గాజువాకలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

సంఘటనా స్థలాన్ని కలెక్టర్ వినయ్ చంద్, సీపీ ఆర్కే మీనా సందర్శించి ప్రమాదానికి గల కారణాలను యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే  సీఎం జగన్‌ ప్రమాదంపై ఆరా తీశారు. రియాక్టర్‌ వద్ద లీకేజీ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ఆయనకు తెలిపారు. దీంతో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ముందు జాగ్రత్తగా ఫ్యాక్టరీని షట్ డౌన్ చేసినట్టు అధికారులు సీఎంతో చెప్పారు. 

ప్రతిపక్ష నేత చంద్రబాబు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరుసగా జరుగుతున్న గ్యాస్ లీకేజీ ఘటనలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటివి చాలా బాధకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వ ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కాగా  సంభవించిన సంగతి తెలిసిందే.

   Politics

   Lifestyle