HomeTelugu news

మచిలీపట్నంలో వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య
Published By :  Lasya Raghavaraju Image Image
YCP leader Moka Bhaskarrao brutally murdered in Machilipatnam
Monday Jun 29, 2020
కృష్ణాజిల్లాలో వైసీపీ నేత, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్‌ హత్య కలకలం రేపుతోంది. మచిలీపట్నంలో వైసీపీ నాయకుడు మోకా భాస్కరరావుని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. ఈరోజు చేపల మార్కెట్ కు వెళ్లిన భాస్కరరావును దుండగులు కత్తితో ఛాతీపై పొడిచి పరారయ్యారు. 

నెత్తుటిమడుగులో పడి ఉన్న భాస్కరరావును స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కత్తులకు సైనేడ్ పూసి వాటితో పొడిచినట్టు వైద్యులు చెప్పారు.  ఇద్దరు వ్యక్తులు ఈ హత్యలో పాల్గొన్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పక్కా ప్రణాళిక ప్రకారమే హత్య చేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఆయన హత్యతో మచిలీపట్నం ఉలిక్కిపడింది. 

ఇది ముమ్మాటికి రాజకీయ హత్యేనని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మోకా భాస్కరరావుతో విబేధాలున్న ఒక టీడీపీ నేత ఈ హత్య చేయించినట్టు ఆరోపిస్తున్నారు. ఈ హత్యకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.

   Politics

   Lifestyle