HomeTelugu news

పెళ్లిపీటలపైనే కరోనా లక్షణాలతో వధువు మృతి
Published By :  Lasya Raghavaraju Image Image
Bride dies during Marriage rituals with Corona symptoms
Monday Jun 29, 2020
మరికొద్ది నిమిషాల్లో బంధుమిత్రుల సమక్షంలో తన మనసుకు నచ్చినవాడితో తాళి కట్టించుకుని కొత్త జీవితాన్ని ఎన్నో ఆశలతో ఊహించుకొని కలలు కన్న యువతి కరోనా లక్షణాలతో మృత్యువాత పడడంతో రెండు కుటుంబాలలో విషాదం నెలకొంది.  ఉత్తరప్రదేశ్‌లోని ఓ పెళ్లిలో ఈ విషాద సంఘటన జరిగింది. 

వివరాల్లోకి వెళ్తే...కనౌజ్‌ జిల్లాలో భగత్‌పూర్వ గ్రామంలో ఈ నెల 27న సంజయ్, వనితలకు పెళ్లి నిశ్చయించారు. సంప్రదాయం ప్రకారం వధువు ఇంట్లో శుక్రవారం రాత్రి పెళ్లి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వరుడు కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ఇంటికి చేరుకున్నాడు. పెళ్లితంతు జరుగుతున్న సమయంలో వనిత ఒక్కసారిగా పెళ్లి పీటలపై కుప్పకూలిపోయింది.  ఊపిరాడటం లేదని చెప్పడంతో ఆందోళన చెందిన బంధువులు దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్తే కరోనా నెగటివ్ అని వస్తేనే జాయిన్ చేసుకుంటామన్నారు. దీంతో వధువు తంద్రి కిశోర బాథమ్ ఆమెను కాన్పూర్‌కు తీసుకెళ్తుండగా మార్గ మధ్యలోనే కన్నుమూసింది. 

ఈ ఘటనతో పెళ్లి పందిట్లో మోగాల్సిన మేళాలు, ఆమె చావుకు భజాలు అయ్యాయి. పోలీస్ ఎమర్జెన్సీ నెంబర్ 112కు ఫోన్ చేయగా వినిత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. శనివారం సాయంత్రం అంత్యక్రియలు జరిపించారు.  ఈ ఆకస్మిక మరణంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.  

   Politics

   Lifestyle