HomeTelugu news

హిజ్బుల్ ముజాహిదీన్ క‌మాండ‌ర్ మ‌సూద్ అహ్మ‌ద్ భ‌ట్‌ హతం
Published By :  Lasya Raghavaraju Image Image
Hizbul Mujahiddin Commander Masood Ahmad killed in encounter
Monday Jun 29, 2020
జమ్మూ కశ్మీర్‌లో భద్రతా బలగాలు ఈ రోజు హిజ్బుల్ ముజాహిదీన్ క‌మాండ‌ర్ మ‌సూద్ అహ్మ‌ద్ భ‌ట్‌ను మట్టుబెట్టాయి. ద‌క్షిణ క‌శ్మీర్ జిల్లాలోని కుల్‌చోరాలో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో అహ్మ‌ద్ భ‌ట్‌తో పాటు మ‌రో ఇద్ద‌రు ఉగ్రవాదులను హ‌త‌మార్చినట్లు అధికారులు వెల్లడించారు. 

గడిచిన వారం రోజులుగా జమ్మూ కశ్మీర్‌లో తలదాచుకున్న ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. భద్రతా బలగాల కంట పడకుండా తలదాచుకొని దాడులకు కుట్ర చేస్తున్న ముష్కరులను వరుసగా మట్టుబెడుతూనే ఉన్నారు. తాజాగా ఈ ఉదయం హిజ్బుల్ ముజాహిదీన్ క‌మాండ‌ర్ మ‌సూద్ అహ్మ‌ద్ భ‌ట్‌ తో పాటు మరో ఇద్దరిని మట్టుబెట్టాయి.  ఈ ఘటనతో దోడా ఇక ‘ఉగ్ర‌వాదరహిత’ జిల్లాగా మారిన‌ట్లు అధికారులు ప్రకటించారు. ఆర్మీ, జమ్మూకశ్మీర్‌ పోలీసులు‌, సీఆర్‌పీఎఫ్ ద‌ళాలు సంయుక్తంగా ఈ ఆప‌రేష‌న్ చేప‌ట్టాయని తెలిపారు. ఎన్‌కౌంట‌ర్ జరిగిన ప్రాంతం నుంచి ఓ ఏకే రైఫిల్‌, రెండు తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

జ‌మ్మూక‌శ్మీర్ పోలీసు చీఫ్ దిల్‌బాగ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. హిజ్బుల్ క‌మాండ‌ర్ అహ్మద్ భ‌ట్‌తో పాటు ఇద్దు ల‌ష్క‌రే తోయిబా ఉగ్ర‌వాదుల‌ను హ‌త‌మార్చిన‌ట్లు తెలిపారు. మ‌సూద్‌ గతంలో ఓ అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్నాడు. దోడా పోలిస్ స్టేష‌న్‌లో అత‌నిపై కేసు నమోదయ్యింది. అప్ప‌టి నుంచి ప‌రారీలో ఉన్న మ‌సూద్ ఆ తర్వాత హిజ్బుల్‌ గ్రూపులో చేరాడు. కశ్మీర్‌ వేదికగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నాడు. ద‌క్షిణ క‌శ్మీర్ నుంచి ఉగ్ర‌వాదాన్ని తరిమివేయాల‌న్న లక్క్ష్యంతో భ‌ద్ర‌తా ద‌ళాలు ప‌నిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. త్రాల్ ప్రాంతంలో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్ర‌వాదుల‌ను హ‌తమార్చ‌డంతో ఆ ప్రాంతం ఉగ్రవాదరహితంగా మారిన‌ట్లు పోలీసులు ప్రకటించారు.

   Politics

   Lifestyle