HomeTelugu news

దేశంలో ఆగని కరోనా కల్లోలం నిన్న 19,459 కొత్త కేసులు 380 మరణాలు
Published By :  Divya Valluru Image Image
New 19,459 Corona cases registered in India in last 24 hours
Monday Jun 29, 2020
దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు అధికారులను, జనాలను వణికిస్తున్నాయి.   గడచిన ఇరవై నాలుగు గంటల్లో 1,70,560 టెస్టులు చేయగా 19,459 కొత్త కేసులు బయటపడ్డట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.  ఆదివారంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 5.48 లక్షల మార్కును చేరుకుంది. 

నిన్న ఒక్కరోజే 380 మంది వైరస్​ వల్ల ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మీద 16,475 మంది చనిపోయారు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,48,318గా నమోదైంది. వీటిలో 3,21,722 మంది జబ్బు నుంచి కోలుకోగా, 2,10,120 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో కొత్త కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ రికవరీ రేటు కూడా పెరుగుతుండడం ఊరట కలిగిస్తోంది. 

మరోవైపు పంచవ్యాప్తంగా ఇప్పటివరకు 1,02,43,858 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ మహమ్మారి కారణంగా 5,04,410 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారినపడిన వారిలో 55,53,495 మంది కోలుకోగా, 41,85,953 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికాలోనూ కరోనా కేసులు తగ్గడం లేదు. అక్కడ 26,37,077 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. 1,28,437 మంది బాధితులు చనిపోయారు.10,93,456 మంది వైరస్‌ను జయించి డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 14,15,825 మందికి చికిత్స అందిస్తున్నారు. 

   Politics

   Lifestyle