HomeTelugu news

మామిడి తోటలో భారీ సంఖ్యలో గబ్బిలాల మృతి కరోనా భయంలో ప్రజలు
Published By :  Divya Valluru Image Image
Corona panic grips after huge numbers of bats dead in UP
Wednesday May 27, 2020
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఆందోళనకరంగా మారుతున్న తరుణంలో ఉత్తర ప్రదేశ్‌లో భారీ సంఖ్యలో గబ్బిలాలు చనిపోవడంతో అక్కడి స్థానికుల్లో ఒక్కసారిగా అలజడి రేగింది. యూపీలోని బేల్‌ఘాట్ గ్రామంలో ఓ మామిడి తోటలో 50 కి పైగా గబ్బిలాలు మృత్యువాత పడ్డాయి. అవి కరోనా వైరస్ వల్లే చనిపోయాన్న ఉద్దేశంలో ఆ గ్రామంలోని ప్రజల్లో కలవరం మొదలైంది. 

బెల్ఘాట్‌లోని రాధాస్వామి సత్సంగ్ భవనం సమీపంలోని తోటలో గబ్బిలాల మృతదేహాలు గుర్తించారు. దీనిపై డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (DFO)అవినిష్ కుమార్ స్పందించారు. క్రిమి సంహారక మందులు వాడకం వల్లగానీ, లేక హార్ట్ స్ట్రోక్‌తోనైనా చనిపోయి ఉండొచ్చునని ఆయన  అభిప్రాయపడ్డారు.  చనిపోయిన గబ్బిలాల మృతదేహాలను పరీక్షల నిమిత్తం బరేలీలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిస్టూట్‌కు తరలించారు. 

అయితే గబ్బిలాలు అధిక ఉష్ణోగ్రత, తాగేందుకు నీరు దొరక్కపోవడంతోనే గబ్బిలాలు చనిపోయి ఉండొచ్చని అటవీ శాఖ అధికారులు అభిప్రాయపడ్డారు. అయితే నివేదిక వచ్చిన తర్వాత గబ్బిలాల మృతికి గల కారణాలపై స్పష్టత వస్తుందని అధికారులు పేర్కొన్నారు.

   Politics

   Lifestyle