HomeTelugu news

చెన్నై నోకియా ప్లాంటులో 42 మంది కార్మికులకు కరోనా
Published By :  Divya Valluru Image Image
Chennai Nokia plant closed after 42 workers tested positive for corona
Wednesday May 27, 2020
కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై సమీపంలోని శ్రీ పెరంబుదూర్ ప్రాంతంలో ఉన్న నోకియా ప్లాంటులో కార్యకలాపాలను నిలిపివేసినట్టు ఆ సంస్థ మంగళవారం ప్రకటించింది. నోకియా సెల్ ఫోన్ల తయారీ కంపెనీలో 42 మంది కార్మికులకు కరోనా వైరస్ సోకిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎంతమంది కార్మికులు వైరస్ బారిన పడ్డారనేది నోకియా వెల్లడించలేదు. 

లాక్ డౌన్  సడలింపుల నేపథ్యంలో సంబంధిత నిబంధనల ప్రకారం ఇటీవల ఇక్కడ కార్యకలాపాలను ప్రారంభించామని, భౌతిక దూరం, క్యాంటీన్ లో మార్పులు లాంటి  నిబంధనలను పాటిస్తున్నామని నోకియా ఒక ప్రకటనలో తెలిపింది.

చైనా దేశానికి చెందిన స్మార్ట్ ఫోన్ తయారీదారు అయిన ఒప్పో సంస్థ న్యూఢిల్లీ శివార్లలో ఉన్న ప్లాంటును గత వారం మూసివేశారు. ఒప్పో కంపెనీలో 9 మంది కార్మికులకు కరోనా సోకింది. నోకియా, ఒప్పో ప్లాంట్ల మూసివేతతో మొబైల్ ఫోన్ల తయారీకి బ్రేకు పడింది. 

   Politics

   Lifestyle