HomeTelugu news

భారత్ లో 24 గంటల్లో కొత్తగా 6535 కరోనా కేసులు
Published By :  Divya Valluru Image Image
Corona update with 6535 new cases in India toll cross 145380
Wednesday May 27, 2020
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఆందోళనకరంగా మారుతున్నాయి. లాక్ డౌన్ ఉన్నప్పటికీ కరోనా వ్యాప్తి మాత్రం ఆగట్లేదు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6535 కేసులు నమోదవ్వడంతో... మొత్తం కేసుల సంఖ్య 145380కి చేరింది. 24 గంటల్లో 146 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 4167కి చేరింది. మొత్తం కేసుల్లో 60490 మంది రికవరీ అవ్వగా ప్రస్తుతం 80722 మంది ఐసోలేషన్ కేంద్రాల్లో ట్రీట్‌మెంట్ పొందుతున్నారు.

ముఖ్యంగా మహారాష్ట్రలో కేసుల సంఖ్య 50 వేలు దాటి... 52667కి చేరింది. అలాగే... తమిళనాడులో 17082 కేసులు, గుజరాత్‌లో 14460 కేసులు, ఢిల్లీలో 14053 కేసులుండటం చర్చనీయాంశం అవుతోంది. ఈ రాష్ట్రాలతోపాటూ... మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో కూడా కేసుల సంఖ్య 10 వేల వైపుగా పరుగులు పెడుతోంది. ఇండియా ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ కేసులున్న దేశాల్లో 10 స్థానంలో ఉండగా... ఎక్కువ కొత్త కేసులు నమోదవుతున్న దేశాల్లో నాలుగో స్థానంలో ఉంది.

దేశంలో కరోనా లెక్కలు ఇంకా ఎక్కడి దాకా వెళ్లిపోతాయో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. జూన్‌లో 20 లక్షలకు చేరుకుంటాయని CCMB అంచనా వెయ్యడం కూడా ఆందోళన కలిగిస్తోంది. 

   Politics

   Lifestyle