HomeTelugu news

ఇండిగో విమానంలో కరోనా రోగి ప్రత్యక్షం 129 మంది క్వారంటైన్
Published By :  Divya Valluru Image Image
Corona positive case detected in Chennai-Coimbatore Indigo flight
Wednesday May 27, 2020
లాక్‌డౌన్ సడలింపుతో దాదాపు రెండు నెలల తర్వాత దేశీయంగా విమానా ప్రయాణాలు ప్రారంభం అయ్యాయి. థర్మల్ స్క్రీనింగ్ టెస్టుల తర్వాత ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. అయితే విమానయానం మొదలైన రోజే అయిన రోజే చెన్నై-కోయంబత్తూర్ ఇండిగో విమానంలో కరోనా పాజిటివ్ రోగి ప్రయాణించడం ఇప్పుడు కలవరం సృష్టిస్తున్నాయి. దీంతో 129 మంది క్వారంటైన్‌కు వెళ్లాల్సి వచ్చింది. 

చెన్నై నుంచి కోయంబత్తూర్ నగరానికి వచ్చిన 6ఈ 381 ఇండిగో విమానం నుంచి దిగిన ప్రయాణికులను పరీక్షిస్తుండగా అందులో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలడంతో కలకలం రేగింది. విమానంలో ప్రయాణించిన కరోనా బాధితుడిని కోయంబత్తూర్ లోని వినాయక్ హోటల్ కు తరలించి నిర్బంధంలో ఉంచారు. అనంతరం అతన్ని ఈఎస్ఐ ఆసుపత్రిలో చేర్చారు. ఇండిగో విమానంలో కరోనా రోగితో కలిసి ప్రయాణించిన వారందరికీ వైద్యపరీక్షలు చేయగా వారికి నెగిటివ్ వచ్చినా వారందరినీ 14రోజుల పాటు హోంక్వారంటైన్ కు తరలించారు. విమానంలో ప్రయాణికులందరూ ఫేస్ మాస్క్, ఫేస్ షీల్డు, గ్లౌజులు ధరించి అన్ని ముందుజాగ్రత్తలు తీసుకున్నారని, కరోనా బాధిత ప్రయాణికుడి సమీపంలో ఎవరూ కూర్చోలేదని ఇండిగో అధికారులు చెప్పారు.  విమానం మొత్తం శానిటైజ్ చేసినట్టు వెల్లడించింది.

విమాన క్యాబిన్ సిబ్బందిని కూడా 14 రోజుల పాటు హోం క్వారంటైన్ చేశామని ఇండిగో వెల్లడించింది. కరోనా బాధితుడు చెన్నైలోని ఓ స్టార్ హోటల్ లో పనిచేస్తున్నాడని అధికారులు చెప్పారు. 

   Politics

   Lifestyle