HomeTelugu news

కరోనాను ఇండోమెథాసిన్ కట్టడి చేస్తుందట
Published By :  Divya Valluru Image Image
ICMR sits on proposal to try Rs 5 arthritis drug in Covid cases
Tuesday May 26, 2020
చైనాలోని వుహాన్ నగరంలో పుట్టి దాదాపు 215 దేశాలకు విస్తరించి మరణమృదంగం మ్రోగిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్‌కు ఇప్పటివరకు మందు లేదు. ప్రపంచ దేశాలన్నీ కరోనా మందు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో వైద్యులు ఈ మహమ్మారికి ఏదో ఒక మందు పనిచేయకపోతుండా అని  ట్రై చేస్తున్నారు. మలేరియాకు వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్ మొదట్లో కాస్త పనిచేసినట్లు కనిపించింది. అయితే దాని వల్ల గుండెపోటు, కాలేయ సమస్యలు తలెత్తడంతో డబ్ల్యూహెచ్ఓ నిషేధం విధించింది. అజిత్రోమైసిన్ కూడా డేంజరేనని అంటున్నారు. 

ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ముందుకు ఆసక్తికర ప్రతిపాదన వచ్చింది.  ఆర్థరైటిస్ చికిత్సకు వాడే ఇండోమెథాసిన్ కరోనా రోగులను దెబ్బతీసే సైటోకిన్‌ అనే ప్రమాదకర ప్రొటీన్‌ను అడ్డుకోగలదని కిడ్నీ వ్యాధుల నిపుణుడు రాజన్ రవిచంద్రన్ చెప్పారు. కిడ్నీ మార్పిడి చేయించుకున్న రోగుల్లో సైటోకిన్‌ను ఇండోమెథాసిన్ అరికట్టిందని అన్నారు. కరోనా రోగులపై ఈ మందును ప్రయోగించేందుకు అనుమతివ్వాలని ఆయన ఐసీఎంఆర్ సహా పలు దేశాల్లోని మెడిసిన్ కౌన్సిళ్లను కోరుతున్నారు.  

బ్రిటన్ కు చెందిన జొనాథన్ లిబోవిజ్ అనే వైద్యుడు కూడా ఇండోమాసిన్ కరోనా రోగుల్లో బాగా పరిచేసందని చెప్పారు. ఇండోమెథాసిన్ క్యాప్సూల్ ఒక్కొక్కటి ఐదు రూపాయలకే దొరుకుతుంది. దీని ప్రయోగాలు విజయవంతమైతే కరోనా చికిత్స ఖర్చు భారీగా తగ్గుతుంది.

   Politics

   Lifestyle