HomeTelugu news

హైదరాబాద్‌ అంబర్‌పేటలో దారుణం తమ్ముణ్ని ఉరితీసిన అన్న
Published By :  Lasya Raghavaraju Image Image
Man kills own alcoholic brother over constant fights
Tuesday May 26, 2020
మద్యం మత్తులో తరుచూ గొడవ పడుతున్నాడనే కోపంతో సొంత తమ్ముడినే ఉరేసి చంపాడు ఓ వ్యక్తి. హైదరాబాద్  అంబర్‌పేట చెన్నారెడ్డి నగర్‌లో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. 

వివరాల్లోకి వెళ్తే...షాహిద్‌ అనే వ్యక్తికి మహ్మద్‌ మునావర్‌ (32) అనే తమ్ముడు ఉన్నాడు. పదేళ్ల క్రితం స్థానికంగా ఉండే కల్పన అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తరుచూ గొడవలు జరగడంతో రెండేళ్ల క్రితం వీరిద్దరూ విడిపోయారు. ఈ క్రమంలో అతడు తాగుడుకు బానిసయ్యాడు. తరుచూ మద్యం మత్తులో అన్న షాహిద్‌తో గొడవ పడే వాడు. అతని చేష్టలతో విసిగిపోయిన షాహిద్ తమ్ముడి అడ్డు తప్పించుకోవాలని అనుకున్నాడు. మంగళవారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో మద్యం మత్తులో ఉన్న మునావర్‌‌కు తాడుతో ఉరి బిగించాడు. ఊపిరాడకపోవడంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. 

మునావాత్ ఉరి వేసుకుని చనిపోయాడని బుకాయించాడు. అయితే మ్రుతిది భార్య అనుమానం వ్యక్తం చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు షాహిద్ ను తమదైన పద్దతిలో విచారించగా అసలు నిజం చెప్పేసాడు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. 

   Politics

   Lifestyle