HomeTelugu news

భారత్‌లో గ‌త 24 గంట‌ల్లో 6,535 కేసులు 4 వేలు దాటిన మరణాలు
Published By :  Divya Valluru Image Image
Corona death toll rises to 4167 in India 6500 cases in last 24 hrs
Tuesday May 26, 2020
కంటికి కనిపించని కరోనా భారత్‌లో ఉగ్రరూపం దాలుస్తోంది. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించిన తర్వాత దేశంలో కరోనా రోజుకో రికార్డు సృష్టిస్తోంది. తాజాగా గత 24 గంటల్లో నమోదైన వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 6,535 కేసులు నమోదు కాగా, 146 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

తాజా లెక్కల ప్రకారం దేశంలో ఇప్పటి వరకు మొత్తం 1.45 లక్షల మందికి వ్యాధి సోకింది. దీంతో మరణాల సంఖ్య 4167 కు చేరింది. తాజా కేసులతో భారత్ ప్రపంచంలో వైరస్ వ్యాప్తిలో 10వ స్థానానికి చేరింది. ఇరాన్‌లో లక్షా 35 వేల కేసులు ఉండగా.. భారత్‌లో 1.45 లక్షల కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పుడు ఆ దేశాన్ని భారత్ వెనక్కి నెట్టింది. ప్రస్తుతం 80 వేలకుపైగా యాక్టివ్ కేసులు ఉండగా.. రికవరీ రేటు 42.6 శాతానికి చేరింది. 

ముఖ్యంగా మహారాష్ట్రలో వైరస్ పెద్ద ఎత్తున ప్రభావం చూపుతోంది. అక్కడ కేసుల సంఖ్య 52,667కు చేరింది. నిన్న ఒక్కరోజే 2436 కేసులు నమోదయ్యాయి. 1695 మంది వైరస్‌కు బలి అయ్యారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 55.86 లక్షల మంది ఇన్ఫెక్షన్ బారిన పడగా.. 3.47 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 

   Politics

   Lifestyle