HomeTelugu news

శ్రీకాకుళంలో వలస కూలీల బస్సు బోల్తా 33 మందికి గాయాలు
Published By :  Divya Valluru Image Image
Over 30 migrants injured after bus stumbles in Srikakulam district
Tuesday May 26, 2020
కరోనా లాక్ డౌన్ కారణంగా అష్టకష్టాలు పడుతున్న వలస కూలీలను రోడ్డు ప్రమాదాలు విడిచిపెట్టడం లేదు. తిండి కూడా దొరకని పొట్ట చేత పట్టుకుని స్వంత ఊర్లను, రాష్ట్రాలకూ ప్రయాణిస్తున్న వారి వాహనాల్లో అపశృతి చోటు చేసుకుంటూనే ఉంది. తాజాగా శ్రీకాకుళం జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కూలీలతో వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. దీంతో 33 మంది గాయపడ్డారు. 

పశ్చిమబెంగాల్‌కు చెందిన వలసకూలీలు కర్ణాటకలో క్వారంటైన్‌ ముగించుకుని తమ స్వస్థలాలకు వెళ్తున్నారు. వారు ప్రయాణిస్తున్న బస్సు మందస మండలం బాలిగాం వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో 33 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. దీంతో క్షతగాత్రులను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారందరికి చికిత్స అందిస్తున్నామని ఎటువంటి ప్రమాదం లేదని తెలిపారు. 

వలస కూలీల బస్సు ప్రమాదం తెలిసిన బాధితులు బంధువులు ఆందోళనకు గురయ్యారు. వేగం కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

   Politics

   Lifestyle