HomeTelugu news

ఢిల్లీ తుగ్లకాబాద్ మురికివాడలో అగ్నిప్రమాదం 1500 గుడిసెలు దగ్ధం
Published By :  Divya Valluru Image Image
Over 1500 shanties burnt after massive fire breaks out at Delhi
Tuesday May 26, 2020
దేశ రాజధాని ఢిల్లీలోని తుగ్లకాబాద్ మురికివాడ ప్రాంతంలో గత అర్ధరాత్రి దాటాక భారీ అగ్నిప్రమాదం సంభవించింది.  అర్ధరాత్రి గం.12.50ని.ల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 15వందల వరకు గుడిసెలు ఆహుతయ్యాయి.  సుమారు రెండు కిలోమీటర్ల వరకు మంటలు వ్యాపించాయి. 

అగ్ని ప్రమాదం జరిగినట్లు సోమవారం రాత్రి ఒంటిగంటకు తమకు సమాచారం అందిందని డీసీపీ రాజేంద్రప్రసాద్ మీనా తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 30 ఫైరింజన్లతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం 2 ఎకరాల్లో ఉన్న 1500 పూరిగుడిసెలు కాలి బూడిదైనట్టు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. 

ఈ ప్రమాదంతో వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి.

   Politics

   Lifestyle