HomeTelugu news

శ్రీశైలం దేవస్థానంలో బయటపడ్డ భారీ కుంభకోణం
Published By :  Divya Valluru Image Image
Major scam came into light in Kurnool's Srisailam Devasthanam
Monday May 25, 2020
ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం శ్రీశైలం దేవస్థానంలో భారీ కుంభకోణం బ‌య‌ట ప‌డింది.  కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏకంగా రూ. 3 కోట్లకుపైగా నిధులను స్వాహా చేసినట్లుగా తేలింది. శ్రీశైలంలో ఇటీవలే డోనేషన్ కౌంటర్‌లో రూ. 60 లక్షల స్కామ్ జరిగింది. ఈ ఘటన మరువకముందే మరో కుంభకోణం బయటపడడం ఇప్పుడు సంచలనంగా మారింది. 

శ్రీశైల దేవస్థానంలో రూ. 150 శీఘ్రదర్శనంలో రూ. కోటి 80 లక్షలు మాయమయ్యాయి. అభిషేకం టిక్కెట్లలో రూ. 50 లక్షలు కాజేశారు. భక్తులు ఇచ్చిన విరాళాల్లో రూ. కోటి, గదుల బుకింగ్‌లో రూ. 50 లక్షల అవినీతి జరిగినట్లు అధికారులు గుర్తించారు. రూ. 5వందల టిక్కెట్లు, కంకణాలు, మహామంగళహారతి టిక్కెట్లలో రూ. 50లక్షలు గోల్‌మాల్ అయ్యాయి. తాత్కాలికంగా పనిచేస్తున్న ఉద్యోగులు సాఫ్ట్ వేర్‌ను మార్చి అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. వారి అవినీతి బయటపడటంతో ఒకరిపై ఒకరు ఆల‌య ఈవోకు పరస్పరం ఫిర్యాదులు చేశారు. 

ఈ నేపథ్యంలో శ్రీశైలం ఆలయ ఈవో కె.ఎస్.రామారావు మాట్లాడుతూ.. అక్ర‌మాలు జ‌రిగిన‌ది వాస్తవమేన‌ని, అయితే మొత్తం ఎంత జరిగింది అనేదానిపై ఇంకా పూర్తి నివేదిక రాలేద‌ని చెప్పారు. దేవ‌స్థానంలో జ‌రిగిన అవినీతిపై ప్రభుత్వానికి త్వరలో పూర్తి నివేదిక పంపుతామ‌ని తెలిపారు.

   Politics

   Lifestyle