HomeTelugu news

మైనర్ బాలిక శవాన్ని బయటకి తీసి అత్యాచారయత్నం చేసిన మానవ మృగం
Published By :  Lasya Raghavaraju Image Image
Assam man booked for trying to rape minor girl corpse in graveyard
Friday May 22, 2020
అస్సాం రాష్ట్రంలో అతి జుగుప్సాకర ఘటన వెలుగులోకి వచ్చింది. కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ 51 ఏళ్ల మానవ మృగం ఓ మైనర్ బాలిక శవం పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ హేయమైన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. 

వివరాల్లోకి వెళ్తే....అస్సాంలోని ఓ గ్రామానికి చెందని 14 ఏళ్ల బాలిక అనుమానాస్పద రీతిలో ఈ నెల 17న హటాత్తుగా మరణించింది. బాలిక తల్లిదండ్రులు ఆమె శవాన్ని ఊరికి సమీపంలోని సైమన్ నది ఒడ్డున ఖననం చేశారు. అదే గ్రామానికి చెందిన అకాన్ సైకియా(51) అనే వ్యక్తి ఆ మరుసటి రోజే బాలికను ఖననం చేసిన సైమన్ నదీ తీరానికి వెళ్లి ఆమె సమాధిని తవ్వి శవాన్ని బయటకు తీశాడు.బాలిక శవంపై అత్యాచారం చేసేందుకు యత్నిస్తుండగా అటుగా వెళ్తున్న మత్స్యకారుడు చూసి షాక్‌కి గురయ్యాడు. సమాధిలో నుంచి శవాన్ని బయటికి తీసి రేప్ చేసేందుకు ప్రయత్నించడంతో కంగుతిన్న మత్స్సకారుడు.. వెంటనే విషయాన్ని స్థానికులకు, పోలీసులకు చేరవేశాడు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు తక్షణం గ్రామానికి చేరుకుని అకాన్ సైకియాని అదుపులోకి తీసుకున్నారు. 

కుటుంబ సభ్యుల అనుమతితో బాలిక శవాన్ని మరోమారు పోస్టుమార్టంకు తరలించినట్లు ఆ జిల్లా ఎస్పీ ధనుంజయ్ తెలిపారు. నిందితుడిపై పోక్సో, ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. రెండు సార్లు పెళ్లిళ్లు చేసుకున్న అకాన్‌పై గతంలోనూ పలు కేసులున్నాయి. మొదటి భార్య గృహ హింస కేసు పెట్టడంతో అరెస్టై జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. కరోనా నేపథ్యంలో అకాన్‌ని పెరోల్‌పై విడుదల చేసినట్లు తెలుస్తోంది.