HomeTelugu news

యూపీ షమ్లీలో కలకలం రేపిన ఇద్దరు యువతుల హత్య
Published By :  Lasya Raghavaraju Image Image
Two girls found murdered in Shamli sugarcane fields
Friday May 22, 2020
యూపీలోని షామ్లి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కైరానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు యువతులను గుర్తు తెలియని దుండగులు హత్య చేసి సమీపంలోని చెరుకుతోటలో పడేసి వెళ్లిపోయారు. యువతుల ఒంటిపై గాయాలుండడంతో అత్యాచారం చేసి హత్య చేసి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలానికి దారితీసింది. 

యువతుల వయసు సుమారు 20, 22 ఏళ్ల వయసు ఉంటుంది. శుక్రవారం ఉదయం తోటలో యువతుల మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి పోస్ట్ మార్టం కొరకు ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారు ఎవరు, ఈ హత్య ఎప్పుడు జరిగింది అనే దానిపై వివరాలు సేకరిస్తున్నారు. 

నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.