HomeTelugu news

బెంగాల్‌కు తక్షణ సాయంగా రూ.వెయ్యి కోట్లు ప్రకటించిన ప్రధాని మోదీ
Published By :  Lasya Raghavaraju Image Image
PM Modi announces Rs 1000 cr immediate relief for cyclone hit WB
Friday May 22, 2020
అంఫాన్‌ తుఫానుతో తీవ్రంగా నష్టపోయిన పశ్చిమబెంగాల్‌కు తక్షణ సాయంగా రూ.వెయ్యి కోట్లను ప్రధాని మోదీ ప్రకటించారు.  బుధవారం సాయంత్రం వెస్ట్ బెంగాల్ లోని దీఘా, బంగ్లాదేశ్ లోని హతియా వద్ద అంఫన్ తీరం దాటింది. తుఫాను వల్ల బెంగాల్  రాష్ట్రంలో ఇప్పటివరకు 80 మందికిపైగా మరణించగా, కోల్‌కతాలోని విమానాశ్రయం పూర్తిగా నీట మునిగిపోవడంతోపాటు, వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. 

శుక్రవారం ప్రధాని మోడీ బెంగాల్ లో తుఫాన్ బాధిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వేను నిర్వహించారు.  పరిస్థితిని అంచనా వేసి కష్ట సమయంలో బెంగాల్‌ను అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. తక్షణ సాయం కింద వెస్ట్ బెంగాల్ కు వెయ్యి కోట్లు మంజూరు చేశారు.  అలానే మృతి చెందిన వ్యక్తులకు రూ.2 లక్షల రూపాయల ఆర్ధిక సాయం ప్రకటించారు.  గాయాలైన వ్యక్తులకు కేంద్రం రూ. 50 వేల రూపాయల సహాయం అందిస్తున్నట్టు ప్రధాని మోడీ తెలిపారు. 

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని నిలువరించడానికి లాక్‌డౌన్‌ విధించిన తర్వాత ప్రధాని మోదీ మొదటిసారిగా ఢిల్లీ వదిలి బయటకు బెంగాల్ ఏరియల్ సర్వేకే వచ్చారు. ఈ సంధర్బంలో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కరోనాపై పోరాటం కొనసాగిస్తున్నది చెప్పారు.