HomeTelugu news

వరంగల్ బావిలో ఏడుగురు వలస కూలీల మృతదేహాలు లభ్యం
Published By :  Lasya Raghavaraju Image Image
Seven of same Bihar family found dead in Warangal well
Friday May 22, 2020
బావిలో ఒకే కుటుంబానికి చెందినా ఏడుగురు వలస కూలీల మృతదేహాలు లభ్యం కావడం వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించింది. వరంగల్‌ నగర శివారులోని గొర్రెకుంట ప్రాంతంలో ఉన్న ఒక గన్నీ సంచుల గోదాం వద్ద పాడుబడ్డ బావిలో అనుమానాస్పద స్థితిలో ఇప్పటి వరకు ఏడు మృతదేహాలు బయటపడ్డాయి. గురువారం నాలుగు మృతదేహాలు బయటపడగా, శుక్రవారం మరో మూడు మృతదేహాలను గుర్తించారు.

మృతులు ఎండీ మక్సూద్‌(50), ఆయన భార్య నిషా(45), కుమార్తె బుస్ర (20), మూడేళ్ల మనవడిగా గుర్తించారు. శుక్రవారం లభ్యమైన మూడు మృతదేహాల్లో మక్సూద్‌ కుమారుడు షాబాద్‌(22), బిహార్‌కు చెందిన కార్మికుడు శ్రీరామ్‌గా గుర్తించారు. మరో మృతదేహం వివరాలు తెలియాల్సి ఉంది.  వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. కుటుంబం మొత్తం ఒకేసారి ఇలా బావిలో శవాల్లా కనిపించడం వెనక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వారంతా ఆత్మహత్య చేసుకున్నారా..? లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పరిశీలిస్తున్నారు. 

బిహార్‌కు చెందిన మక్సూద్‌ (50) కుటుంబం 20 ఏళ్ల క్రితం వరంగల్‌కు వలస వచ్చింది. అక్కడా ఇక్కడా పని చేసుకుంటూ కొన్ని రోజుల క్రితం గీసుకొండలోని గోనే సంచులు తయారు చేసే పరిశ్రమలో పని చేస్తున్నారు. వీరంతా పరిశ్రమలోనే ఓ గదిలో నివాసం ఉంటున్నారు. తాజాగా మన్సూద్ అతని భార్య నిషా, ఇద్దరు కొడుకులు, కూతురు, మనవడు బావిలో శవాలై కనిపించారు. వీరంతా మసూద్‌, నిషా, బుషారాకతూన్‌, బేబీ, షకీల్‌, షాబాజ్‌ అలం, సోహైల్ అలంగా గుర్తించారు. అయితే వీరితో పాటు పక్కనే నివాసం ఉండే బీహార్‌కు చెందిన వలస కూలీలు ఇద్దరు కనిపించడం లేదు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. మృతదేహాలపై ఎటువంటి గాయాలు లేకపోవడంతో పోస్టుమార్టం రిపోర్టు రావాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.