HomeTelugu news

కమల్‌నాథ్ మీడియా సమావేశానికి హాజరైన జర్నలిస్ట్‌కు కరోనా పాజిటివ్
Published By :  Lasya Raghavaraju Image Image
Journalist who attended Kamal Nath's press meet test positive for corona
Wednesday Mar 25, 2020
ప్రాణాంతక కరోనా వైరస్ ఇండియాలో యమ స్పీడుగా వ్యాపిస్తోంది. తాజాగా మధ్యప్రదేశ్ లో ఓ మీడియా జర్నలిస్టుకు కరోనా వైరస్ సోకినట్లు నిర్థారణ అయింది. మార్చి-20న భోపాల్ లో అప్పటి సీఎం కమల్ నాథ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి హాజరైన జర్నలిస్టుకు ఇప్పుడు కరోనా పాజిటివ్ అని తేలింది. అంతేకాకుండా ఆ జర్నలిస్ట్ కూతురికి కూడా కరోనా సోకినట్లు సమాచారం. 

ఆ జర్నలిస్ట్ కూతురు మార్చి-17న లండన్ నుంచి భారత్ కు వచ్చినట్లు తెలిసింది.కూతురు ద్వారానే జర్నలిస్ట్ కు సోకినట్లు తెలుస్తోంది. మార్చి-20న తాను సీఎం పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించేందుకు కమల్ నాథ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు  వైరస్ వ్యాప్తి చెందే అవకాలను తగ్గించేందుకు ఆ మీడియా సమావేశానికి హాజరైన జర్నలిస్టులు,అధికారులు అందరూ ఇప్పుడు క్వారంటైన్(నిర్భందం)అవ్వాల్సి ఉంటుంది. అయితే కమల్ నాథ్ కూడా తనకు తానుగా క్వారంటైన్ అయ్యారు. మధ్యప్రదేశ్ లో ఇప్పటివరకు 14కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా సోకినవారిసంఖ్య 562కి చేరింది.

కరోనా కేసులు దేశంలో రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో మంగళవారం  జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ... వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు 21రోజులు(ఏప్రిల్-14,2020)వరకు దేశవ్యాప్త లాక్ డౌన్ ను ప్రకటించారు. అత్యవసర,ముఖ్యమైన సేవలు మాత్రం కొనసాగుతాయని తెలిపారు. ఈ 21రోజులు మనకు చాలా ముఖ్యమైనవని,లాక్ డౌన్ ఆదేశాలను కనుక ప్రజలు సీరియస్ గా పాటించకపోతే పరిస్థితి అదుపుతప్పి పోతుందని,దేశంపై భయంకరమైన ప్రభావం పడుతుందని మోడీ తెలిపారు. 

   Politics

   Lifestyle