HomeTelugu news

బీజేపీ ఎంపీ కుమార్తెకు కరోనా పాజిటివ్
Published By :  Lasya Raghavaraju Image Image
BJP MP Siddeswar's daughter Aswini attacked with Corona
Wednesday Mar 25, 2020
కర్నాటక రాష్ట్రంలో మరో కరోన పాజిటివ్ కేసు నమోదైంది. కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ జీఎం సిద్ధేశ్వర కుమార్తె. అస్వినికి కరోన వైరస్ సోకింది.  దీంతో ఆమెను ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

అశ్విని ఈ నెల 20వ తేదీన గుయానా నుంచి న్యూయార్క్, ఢిల్లీ మీదుగా బెంగ‌ళూరుకు చేరుకుంది. అయితే ఆమెకు క‌రోనా టెస్టులు నిర్వ‌హించ‌గా క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు వైద్యాధికారులు వెల్ల‌డించారు. అశ్విని ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఆమెతో పాటే బెంగ‌ళూరుకు వ‌చ్చారు. ఇద్ద‌రు పిల్ల‌ల వైద్య నివేదిక రావాల్సి ఉంది. ఎంపీ సిద్దేశ్వ‌ర‌కు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా కరోనా నెగిటివ్ వ‌చ్చింది. అశ్విని ఓ ఆస్ప‌త్రిలోని ఐసోలేష‌న్ వార్డులో చికిత్స పొందుతున్నారు.

భరత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇవాళ(25వ తేది) తమిళనాడులో ఒకరు, బెంగళూరులో ఒకరు  కరోనాతో చనిపోయారు. దీంతో  ఇండియాలో కరోనా మృతుల సంఖ్య 11కి చేరగా..పాజిటివ్ కేసుల సంఖ్య 584 కు చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 112 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానంలో కేరళలో 109 పాజిటివ్ కేసులు,కర్ణాటక 41, తెలంగాణ 39,గుజరాత్ లో 38 పాజిటివ్  కేసులు నమోదయ్యాయి. ఇక ఏపీలో 8 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

   Politics

   Lifestyle