HomeTelugu news

అఫ్గానిస్తాన్‌ గురుద్వర్ పై ఐసిస్ ఉగ్రదాడి ; 27 మంది మృతి
Published By :  Lasya Raghavaraju Image Image
Atleast 27 dead after ISIS attacks Kabul Gurudwara in Afganisthan
Wednesday Mar 25, 2020
ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐసిస్ అఫ్గానిస్తాన్‌లో మళ్లీ మారణకాండకు తెగబడింది. కాబూల్‌లోని షోర్‌ బజార్‌ ప్రాంతంలో ఉన్న సిక్కుల ప్రార్థనా మందిరం గురుద్వార్‌పై ఐసిస్ ఉగ్రవాది కాల్పులకు తెగబడ్డాడు. బుధవారం ఉదయం 7 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో దాదాపు 27 మంది మరణించారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కాల్పుల ఘటనతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీంతో ఆ ప్రాంతం అంతా భయానకంగా మారిపోయింది. వెంటనే  అక్కడికి చేరుకున్న భద్రతా బలగాలు గాయాలతో లోపల చిక్కుకుపోయిన సిక్కులను ఆస్పత్రికి తరలించారు. 

ప్రార్థనలు చేసుకుంటున్న సమయంలో ఓ గ్రూపుగా వచ్చిన ఉగ్రవాదులు దీనికి తెగబడ్డారు. అక్కడ ఉన్న భద్రతా సిబ్బందిపై దాడి చేసి మరీ కాల్పులకు తెగబడ్డారు. దాడి సమయంలో సుమారు 150 మంది సిక్కులు మందిరంలో ఉన్నారు. ఇది తమ పనేనని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ ప్రకటన విడుదల చేసింది. 

కాబూల్ లోని గురుద్వారాపై దాడిని తీవ్రంగా కండిస్తున్నట్లు భారత విదేశాంగశాఖ ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు. ఈ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని రవీష్ కుమార్ తెలిపారు. ఈ ఉగ్రదాడిలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. 

   Politics

   Lifestyle