HomeTelugu news

చైనాలో ప్రబలిన హంటా వైర‌స్‌...ఒక‌రి మృతి
Published By :  Divya Valluru Image Image
Man in China dies from Hanta Virus; Fear again in Dragon Country
Tuesday Mar 24, 2020
చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా బీభత్సం సృష్టిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా 17 వేల మందికి పైగా బలయ్యారు. 3 లక్షల 79 వేల 080 మందికి ఈ వైరస్ సోకింది. కరోనా వైరస్ వలన 3 వేలకు పైగా మరణాలతో చైనా అల్లాడిపోయింది. ఇప్పుడిప్పుడే అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. ఇంతలోనే డ్రాగ‌న్ కంట్రిని మ‌రో వైర‌స్ భ‌య‌పెడుతోంది.  

చైనాలోని షాంగ్డాండ్ ప్రొవియ‌న్స్‌లో హంటా వైర‌స్‌ను గుర్తించారు. చైనాలోని యునాన్ ప్రావిన్స్ కు చెందిన ఓ వ్యక్తి హంటా వైరస్ ప్రభావంతో మరణించాడు. చైనాలో ఈ వైరస్ గతంలో తీవ్ర ప్రభావం చూపింది. 1950 నుంచి 2007 మధ్య కాలంలో దీని ప్రభావంతో 15 లక్షల మంది వ్యాధిగ్రస్తులు కాగా, 46 వేల మంది ప్రాణాలు విడిచారు. హంటా వైరస్ ఎలుకల కారణంగా వ్యాపిస్తుందని గుర్తించారు. 

కరోనా శాంతిస్తుందనుకుంటున్న తరుణంలో మరో వైరస్ వెలుగు చూడడంతో చైనా ప్రభుత్వం అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. అయితే ఈ హంటా వైరస్ కు వ్యాక్సిన్ ఉండడం కాస్తలో కాస్త నయం అని చెప్పాలి. ఇది గాలి ద్వారా మాత్రమే సోకుతుంది. మనిషి నుంచి మనిషికి వ్యాపించదు.

   Politics

   Lifestyle