HomeTelugu news

కరోనా నివారణ చర్యలకు రూ.2కోట్లు విరాళం ఇచ్చిన సత్యనాదెళ్ల భార్య
Published By :  Ravi Koneri Image Image
Google CEO Nadella wife donates Rs 2 crore to CM Relief Fund
Tuesday Mar 24, 2020
కరోనా వైరస్ కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది.  కరోనా నియంత్రణకు కఠినమైన నిర్ణయాలు తీసుకునే దిశగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. లాక్ డౌన్ ను సీరియస్ గా తీసుకోవాలని, లేదంటే రాష్ట్రంలో కర్ఫ్యూ విధించాల్సి ఉంటుందని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. కరోనాపై యుద్ధంలో ప్రభుత్వానికి ప‌లువురు అండగా నిలుస్తున్నారు. త‌మ‌వంతు ఆర్ధిక సాయం అందిస్తున్నారు. 

మంగళవారం నాడు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల భార్య అనుపమ నాదెళ్ళ సైతం అదే బాటలో నడిచారు. ఆమె కూడా ప్రభుత్వానికి భారీ విరాళం ఇచ్చారు. కరోనా నివారణ చర్యలకు గాను ముఖ్యమంత్రి సహాయనిధికి సత్యనాదెళ్ల భార్య అనుపమ రూ.2 కోట్ల డొనేషన్ ఇచ్చారు. అనుపమ తండ్రి, విశ్రాంత ఐఏఎస్‌ కేఆర్‌ వేణుగోపాల్‌ సీఎంను కలిసి చెక్‌ అందజేశారు.  టాలీవుడ్ హీరో నితిన్‌ కూడా రూ.10 లక్షల విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవాళ (మార్చి 24,2020) ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి చెక్‌ అందించాడు నితిన్. 

కరోనా నిరోధానికి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులు కరోనా నియంత్రణకు సీఎం సహాయనిధికి రూ.48 కోట్లు విరాళంగా అందజేశారు.

   Politics

   Lifestyle