HomeTelugu news

కరోనా వ్యాప్తి నేపధ్యంలో నేడు ప్రధాని మోదీ కీలక ప్రసంగం..ఏం చెప్తారో
Published By :  Lasya Raghavaraju Image Image
PM Modi to address the Nation for the second time today at 8 PM
Tuesday Mar 24, 2020
దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వేగంగా విస్త‌రిస్తున్న‌ది. ఇప్పటికే దేశంలో 10 మంది చనిపోగా... 490కి పైగా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లోకి తెచ్చినా... ప్రజలు దీన్ని సీరియస్‌గా తీసుకోవట్లేదు. దీంతో ప్రధాని మోదీ ఈ రోజు రాత్రి 8 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.  ఇప్పటికే ఆదివారం నాడు జనతా కర్ఫ్యూకి పిలుపిచ్చిన ప్రధాని మోదీ... ఇవాళ రాత్రి 8 గంటలకు దేశ ప్రజలందర్నీ రెడీగా ఉండమన్నారు. ఇవాళ రాత్రికి తాను ఇవ్వబోయే సందేశం వినేందుకు అందరూ సిద్దంగా ఉండాలని విజ్ఞప్తి చేసారు. 

ఈ రోజు రాత్రి మోదీ గారు ఏం మాట్లాడబోతున్నారు అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  జనతా కర్ఫ్యూను విజయవంతం చేసిన దేశ ప్రజలు...లాక్ డౌన్ ను సీరియస్ గా తీసుకోవట్లేదని మోడీ నిన్ననే ట్వీట్ ద్వారా తెలిపారు. దీంతో ఇవాళ రాత్రికి మరింత ఘాటైన సందేశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఎమర్జెన్సీ విధించే అవకాశం ఉందని, ఆర్టికల్ 360 ప్రకారం ఆర్ధిక ఎమర్జెన్సీ విధిస్తారని అంటున్నారు.  

ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయం ఈరోజు రాత్రికి తెలిసే అవకాశం ఉంటుంది.  

   Politics

   Lifestyle