HomeTelugu news

అనుమానంతో సీరియల్ నటిని చంపేసిన భర్త
Published By :  Lasya Raghavaraju Image Image
Serial actress killed by husband in Delhi over suspicion
Friday Feb 14, 2020
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఓ సీరియల్ నటి హత్య కలకలం రేపింది. మృతురాలిని అనితగా గుర్తించిన పోలీసులు ఆమెను ఆమె భర్తే అనుమానంతో హతమార్చినట్టు విచారణలో కనుక్కున్నారు. 

వివరాల్లోకి వెళ్తే...అనిత ఆమె భర్త రవీంద్రతో ఢిల్లీలో నివాసం ఉంటోంది.ఈమె వృత్తి రీత్యా పలు రకాల టీవీ సీరియళ్లలో నటిస్తూ సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. అనిత పలువురితో సన్నిహితంగా మెలుగుతుండడంతో రవీంద్ర నిత్యం అనితను అనుమానిస్తూ వచ్చేవాడు. దీంతో ఈ అనుమానం కాస్త తుఫాన్ లాగా చిలికి చిలికి పెద్ద వాన అయినట్లు రోజు రోజుకి ఆమెపై అనుమానాన్ని పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలో  ఆమెను హతమార్చాలని తన మిత్రుడితో కలిసి పన్నాగం పన్నాడు.ఇందులో భాగంగా నటి అనితను ముంబై నగరానికి తీసుకువచ్చి ఆమెకు మత్తు మందు ఇచ్చి ఉరివేసి హతమార్చారు.అనంతరం మృతదేహాన్ని పెట్రోలు పోసి తగలబెట్టారు.ఆ తర్వాత ఏమీ ఎరగనట్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే శవం కాలిన వాసనను గమనించిన స్థానికులు దగ్గర ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్నటువంటి పోలీసులు పోస్టుమార్టం ఆధారంగా మృతురాలి వివరాలు తెలుసుకున్న పోలీసులు కేసును చేధించే పనిలో పడ్డారు. అనిత భర్త రవీంద్రను అదుపులోకి తీసుకొని పోలీసులు తమదైన శైలిలో విచారించగా తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనే కారణంగా తానే హతమార్చినట్లు పోలీసుల ముందు నేరం అంగీకరించాడు.

   Politics

   Lifestyle