HomeTelugu news

సెల్ఫీలకు ఫోజులిస్తే..మంత్రి కడియాన్నే మాయం చేసారు
Published By :  Divya Valluru Image Image
Telangana Minister Srinivas Goud gold hand kada stolen in Marriage
Friday Feb 14, 2020
తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తనకు ఎంతో కలిసొచ్చిన, ఇష్టమైన బంగారు కడియాన్ని పోగొట్టుకున్నారు. మహబూబ్‌నగర్‌లోని దేవరకద్రలో స్థానికంగా జరిగిన ఓ వివాహానికి హాజరైన మంత్రిని చూసిన అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. వారిని నిరాశపరచడం ఇష్టంలేని మంత్రి వారితో ఓపిగ్గా సెల్ఫీలు దిగారు. ఆ తర్వాత చూసుకుంటే ఆయన చేతికి ఉండాల్సిన బంగారు కడియం మాయమైంది. దీంతో విస్తుపోవడం మంత్రిగారిపనైంది. 

విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగారు. ఆ కడియం మంత్రికి సెంటిమెంట్ కావడంతో ఎవరైనా తీసి ఉంటే ఇచ్చేయాలని పోలీసులు బతిమాలుకోవడం కనిపించింది. అయినా లాభం లేకపోవడంతో తదుపరి చర్యలు ప్రారంభించారు. ఎలాగైనా దొంగను పట్టుకుని మాయమైన మంత్రి గారి కడియాన్ని రికవరీ చేయాలనీ పోలీసులు అన్ని కోణాల్లో గాలిస్తున్నారు. 

ఇక ఏకంగా మంత్రి చేతికి ఉన్న బంగారు కడియం మాయం కావడంపై స్థానికంగా పెద్ద చర్చే జరిగింది.

   Politics

   Lifestyle