HomeTelugu news

ఎస్వీబీసీలో చైర్మన్ పదవి రేసులో స్వప్న
Published By :  Divya Valluru Image Image
Journalist Swapna to replace Prudhvi as SVBC Chairman
Monday Jan 13, 2020
శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్‌గా పృథ్వీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా ఎస్వీబీసీలో చోటుచేసుకున్న పరిణామాలతో.. ఆ సంస్థ చైర్మన్ పృథ్వీ రాజీనామా చేశారు.  పృథ్వీ తర్వాత ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే దానిపై ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. సోమవారం ఒక్క రోజే ఆ పదవి విషయంలో మూడు పేర్లు వినిపించాయి. ప్రముఖ దర్శకుడు శ్రీనివాసరెడ్డి పేరుతో పాటు ఒక మహిళా ఎమ్మెల్యే పేరు కూడా వినిపించింది.  

అయితే జర్నలిస్ట్ స్వప్నను ఎస్వీబీసీ చైర్మన్ పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె సాక్షిలో నమ్మకమైన ఉద్యోగిగా ఉన్నారు. ఛానల్ పెట్టినప్పటి నుంచి కూడా సంస్థ కోసం పని చేస్తున్నారు. దీనితో జగన్ ఆమెను ఎంపిక చేసారని అంటున్నారు. సంగీతం, సాహిత్యంతో పాటు వివిధ భాషలపై పట్టు ఉన్న స్వప్న ఆధ్వర్యంలో ఎస్వీబీసీని ముందుకి నడిపించాలని జగన్ చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డికి ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ చెప్పారట. 

సీనియర్ జర్నలిస్ట్ కావడం, మహిళ కావడంతో జగన్ ఆమె వైపు మొగ్గు చూపారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె ఎస్వీబీసీ డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్నారు.