HomeTelugu news

నన్ను కూడా అక్కడే చంపేయండి.. చెన్నకేశవులు భార్య
Published By :  Divya Valluru Image Image
Disha rape and murder accused Chennakesavulu wife Lakshmi slams encounter
Friday Dec 06, 2019
దిశ హత్యాచారం కేసులో నిందితులను ఈరోజు తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో తెలంగాణ పోలీసులు ఎన్‍కౌంటర్ చేశారు. కేసులో సీన్ రిక్రియేషన్  చేసేందుకు నిందితులను చటాన్ పల్లికి తీసుకెళ్లి అక్కడ విచారణ చేస్తున్న సమయంలో తుపాకులు లాక్కొని పారిపోవడానికి ప్రయత్నంచగా వాళ్ళను ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. దీనిపై దేశంలోని ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

అయితే దిశ కేసులో ఏ4 నిందితుడుగా ఉన్న చెన్నకేశవులు భార్య  లక్ష్మి ఎన్ కౌంటర్ ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.  లక్ష్మి మాట్లాడుతూ "ఇలాంటి కేసులు ఎన్ని జరాగలేదు, నా భర్త తప్పు చేశాడని పోలీసులు, కోర్టు నమ్మితే దానికి తగిన శిక్ష విధిస్తే బాగుండేది, అలా కాకుండా ఇలా ఎన్ కౌంటర్ చేయడం చాల దారుణం. ఒక అమ్మాయి కోసం నలుగురు ప్రాణాలు తీయడం చాలా పెద్ద తప్పు అని చెన్నకేశవులు భార్య చెప్పారు. 

దిశ ఫోన్ తన చెల్లికి చేసే బదులు వేరే ఎవరికైనా చేసి ఉండవచ్చు కదా అని ప్రశ్నించారు.  మా ఆయనను ఎక్కడ చంపారో నన్ను కూడా అక్కడకు తీసుకొనివెళ్లి చంపండి"  లేకుంటే నేనే ఆత్మహత్య చేసుకుంటా' అని చెన్నకేశవులు భార్య చెప్పారు. 

   Politics

   Lifestyle