HomeTelugu news

దిశ హంతకులను ఎన్‌కౌంటర్‌ చేసిన తెలంగాణ పోలీస్
Published By :  Ravi Koneri Image Image
Veterinary Doctor Disha rape and murder accused killed in encounter
Friday Dec 06, 2019
వెటర్నరీ వైద్యురాలు దిశ హత్యాచారం నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపారు. దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ను సీపీ సజ్జనార్‌ నిర్ధారించారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశాన్ని సీపీ పరిశీలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసే సమయంలో నలుగురు నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు నవీన్, శివ, చెన్న కేశవులు పోలీసుల కళ్లుగప్పి పారిపోయేందుకు ప్రయత్నించారని. తమ వద్ద ఉన్న ఆయుధాలను లాక్కునే ప్రయత్నం చేశారని. దాంతో వారిపై పోలీసులు కాల్పులు జరిపినట్టు తెలిపారు. దిశాను చంపేసి తగులబెట్టిన చోటే నలుగురు రేపిస్టులు చనిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. 

నలుగురి మృతదేహాలను షాద్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో పోలీసులకు కూడా గాయాలైనట్టు సమాచారం.