HomeTelugu news

కారులో మంటలు చెలరేగి వివాహిత సజీవదహనం
Published By :  Divya Valluru Image Image
Hyderabad Woman charred to death after Car catches fire in Bidar
Thursday Dec 05, 2019
కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా చిడుగుప్ప జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. హుమ్నాబాద్ తాలూకా మన్నెకెళ్లి సమీపంలో 65 వ నంబర్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో హైదారాబాద్ నార్శింగ్ కు చెందిన కళ్యాణి సజీవదహనమైపోయింది. 

వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ఉదయ్ కుమార్, కళ్యాణి భార్యాభర్తలు. వ్యాపారరీత్యా ఈ కుటుంబం నాసక్‌లో స్థిరపడింది. గురువారం ఉదయం ఈ దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి కారులో నాసిక్ నుంచి సొంత ఊరికి బయల్దేరారు. మార్గ మధ్యలో కర్ణాటకలోని బీదర్‌ జిల్లా మనేక్కెల్లి నిర్నా క్రాస్‌ రోడ్డు వద్ద వీరు ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు ఎక్కువ అవ్వటంతో  ముందు సీట్లో కూర్చున్న కళ్యాణి బయటకు రాలేకపోయింది. కానీ భర్త ఉదయ్ కుమార్, ఇద్దరు పిల్లలు సంజీవ్, గగన్ లు సురక్షితంగా బైటపడ్డారు. 

కళ్ల ముందే కళ్యాణి సజీవ దహనం అవుతున్నా ఏమీ చేయలేక ఉదయ్ కుమార్ నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. ఈ ఘటనపై స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని కారులో మంటలు ఎలా చెలరేగాయి అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.