HomeTelugu news

దిశ సెల్ ఫోన్ పోలీసులకు దొరికింది
Published By :  Divya Valluru Image Image
Police finally recovers Disha's missing cell phone
Thursday Dec 05, 2019
సాయపడతామని చెప్పిన వారిని నమ్మి వెళ్ళిన పాపానికి అత్యాచారం, హత్యకు గురైన వెటర్నరీ డాక్టర్ దిశ సెల్ ఫోన్ ను పోలీసులు గుర్తించారు. హత్యాచార ఘటన జరిగిన స్థలానికి అర కిలోమీటరు దూరంలో దిశ ఫోన్ ను దోషులు భూమిలో పాతిపెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. 

తొలుత దిశ సెల్‌ఫోన్‌ను నిందితులు మంటల్లో వేసి ఉంటారని పోలీసులు భావించారు. అయితే దానిని పాతిపెట్టినట్టు పోలీసుల విచారణలో నిందుతులు తెలపడంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని గాలించి దిశ ఫోన్ కనుగొన్నారు. సెల్ ఫోన్ తో పాటు మరికొన్ని వస్తువుల్ని కూడా గుర్తించారు. ఇప్పటికే పోలీసులు ఆ సెల్‌ఫోన్‌ ఆధారంగా కాల్ లిస్ట్, కాల్ రికార్డ్‌ను పరిశీలిస్తున్నారు. ఇక దీని ద్వారా మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.

దిశపై ఈ నలుగురు రాక్షషులు చేసిన అకృత్యం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని సర్వత్రా డిమాండ్స్ వినిపిస్తున్నాయి.  ఇటువంటి మావన మృగాలు సభ్య సమాజంలో తిరగటానికి వీల్లేదని వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరైతే ఇటువంటి క్రూరుల్ని మేమే చంపేస్తామని ఆగ్రహావేశాల్ని వెళ్లగక్కుతున్నారు. 

ఈ క్రమంలో దిశ కేసులో మహబూబ్‌నగర్‌లో ఫాస్ట్‌ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు అనుమతి ఇస్తూ బుధవారం (డిసెంబర్ 4) హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. మహబూబ్‌నగర్ మొదటి అదనపు సెషన్స్, జిల్లా న్యాయస్థానాన్ని ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుగా ప్రకటించిన విషయం తెలిసిందే. హత్యాచారం ఘటనకు అర కిలోమీటరు దూరంలో దిశ ఫోన్ ను దోషులు భూమిలో పాతిపెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. సెల్ ఫోన్ తో పాటు మరికొన్ని వస్తువుల్ని కూడా గుర్తించారు.

   Politics

   Lifestyle