HomeTelugu news

లోన్ ఇవ్వలేదని తుపాకీతో బ్యాంకు మేనేజర్ పై దాడి
Published By :  Lasya Raghavaraju Image Image
Man attacks Bank Manager with pistol for rejecting 1 crore loan
Thursday Dec 05, 2019
బ్యాంకు వారు తనకు కోటి రూపాయల లోన్ ఇవ్వలేదని ఓ వ్యక్తి బ్యాంక్ మేనేజర్ పై తుపాకితో దాడి చేసిన ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగింది.  కోయంబత్తూర్‌లోని కెనరా బ్యాంక్‌లో జరిగిన ఈ ఘటనకు సంభందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

వివరాల్లోకి వెళ్తే...వెట్రివేల్ అనే వ్యక్తి కోయంబత్తూర్‌ లోని కెనరా బ్యాంక్‌ లో తన ఆస్తిని తాకట్టు పెట్టి కోటి రూపాయల లోన్ కోసం అప్లై చేసుకున్నాడు.దీని కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా లోన్ వచ్చేందుకు ఓ  బ్రోకర్ కు రూ. 3 లక్షలు ఇచ్చాడు వెట్రివేల్ . కానీ బ్యాంక్ అధికారులు వెట్రివేట్ లోన్ అప్లికేషన్ ను రిజెక్ట్ చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన వెట్రివేల్  తన దగ్గర ఉన్న కత్తి, తుపాకీతో ఆ బ్యాంక్ మేనేజర్ పై దాడి చేశాడు.  బ్యాంక్ మేనేజర్ ను కాపాడేందుకు వచ్చిన మరో ఇద్దరిపై కూడా దాడి చేశాడు.

దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వెట్రివేల్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  తాను తీవ్ర  అప్పుల్లో ఉన్నానని..లోన్ కోసం ఎంతగానో ప్రయత్నించానని, అందుకు 3 లక్షలు లంచం కూడా ఇచ్చానని, ఇప్పుడు లోన్ ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుందామనుకుంటున్నానని అతను చెప్పాడు. 

అయితే ఈ ఘటనపై మేనేజర్ మాట్లాడుతూ వెట్రివేల్ లోన్‌ను హెడ్ ఆఫీస్ నుండి రిజెక్ట్ చేశారని, అప్లై చేసుకున్న బ్యాంక్ రుణం ఎక్కువగా ఉన్నందున లోన్ రిలీజ్ చేయలేదన్నారు, బ్రాంచ్ ఆఫీస్‌కు ఇందులో ఎటువంటి సంబంధం లేదని తెలిపాడు.