HomeTelugu news

హీరోయిన్ ఆశ్రితను పెళ్ళాడిన క్రికెటర్ మనీష్ పాండే
Published By :  Lasya Raghavaraju Image Image
Manish Pandey gets married to actress Ashritha
Monday Dec 02, 2019
భారత క్రికెటర్ మనీష్ పాండే, సినీ నటి ఆశ్రిత పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం ముంబైలోని ఒక హోటల్‌లో ఈ రోజు ఎటువంటి హడావుడి లేకుండా జరిగింది. మనీష్-ఆశ్రిత కుటుంబ సభ్యులతో పాటు, కొద్దిమంది సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. వీరి వివాహానికి సంబంధించి ఫోటోను ఐపీఎల్‌ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ట్వీట్ చేసింది. 

మనీష్ పాండే, అర్షిత శెట్టి గత కొన్ని నెలలుగా ప్రేమలో ఉన్నారు.  ఈ జంట విందు వినోదాలు అంటూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. చివరికి ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి ఈ రోజు పెళ్లి చేసుకున్నారు. మనీష్ పాండే కెప్టేన్సిలో కర్ణాటక జట్టు సయ్యద్‌ ముస్తాక్‌ అలీ దేశవాళీ టీ20 ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆదివారం చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఫైనల్ పోరులో తమిళనాడుపై అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచులో మనీష్‌ పాండే (45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 60 నాటౌట్‌) అజేయ అర్ధ శతకంతో రాణించాడు.

ముంబైకి చెందిన 26 ఏళ్ల అర్షిత తుళు భాషలో 'తెళికెడా బొల్లి' సినిమాతో 2012లో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత 'ఉదయం ఎన్‌హెచ్‌4' ద్వారా తమిళ పరిశ్రమలో అడుగుపెట్టింది. ఇంద్రజిత్, ఓరు కన్నియం మూను కలవనికలం వంటి హిట్ చిత్రాలలో నటించింది. ప్రస్తుతం ఆర్‌.పన్నీర్‌సెల్వం దర్శకత్వంలో 'నాన్‌ దా శివ' చిత్రంలో నటిస్తోంది.

   Politics

   Lifestyle