టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోని పై ఢిల్లీలోని ఓ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు కాబడింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఆమ్రపాలి స్కామ్‌లో ధోని పాత్ర కూడా ఉందని పలువురు ఆరోపించడంతో అధికారులు ఎఫ్ఐఆర్లో ధోని పేరును చేర్చారు.
ధోని ఆమ్రపాలి సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండడంవలనే తాము ఫ్లాట్లు కొనుగోలు చేశామని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన పై నమ్మకంతోనే సోమ్ములు చెల్లించామని పేర్కోన్నారు. ఆమ్రపాలి సంస్థ పలు ప్లాట్లు అమ్ముతామని బాధితుల వద్ద సోమ్మును సేకరించి దానిని నిబంధలను వ్యతిరేకంగా ఇతర కంపెనీల్లో ఇన్వేస్ట్ చేసింది. ఈ వ్యవహారాల్లో టీమిండియా క్రికెటర్ ధోని భార్య సాక్షి ధోనికి కంపెనీ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే డిపాజిట్లు సేకరించిన రియల్ ఎస్టేట్ సంస్థ అగ్రిమెంట్ ప్రకారం ఇళ్లను నిర్మించి ఇవ్వడంలో విఫలం కావడంతో సుమారు 46000 మంది హోమ్ బయ్యర్స్ ఇప్పటికే సుప్రీమ్ కోర్టును ఆశ్రయించారు. కంపెనీ డైరక్టర్లు, అలాగే ఆమ్రపాలీ గ్రూపునకు చెందిన ఇతర అనుబంధ సంస్థలపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.ఇప్పటికే కంపెనీకి చెందిన సీఎండీ అనిల్ శర్మ, కంపెనీ డైరక్టర్లు శివ ప్రియ, అజయ్ కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు.
అటు ధోని కూడా తనకు రావాల్సిన రూ.40కోట్ల బాకీని అమ్రపాలీ గ్రూప్ ఎగ్గొట్టిందని సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 2009 నుంచి 2016 వరకూ ఆమ్రపాలి గ్రూప్‌కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించానని, అయితే అందుకు పారితోషికంగా తనకు రావాల్సిన రూ.40కోట్లు ఇవ్వాల్సి ఉందని పలు దఫాలుగా అడుగుతూనే ఉన్నా కంపెనీ మేనేజ్ మెంట్ నిర్లక్ష్యం చేస్తోందని కోర్టుకు తెలిపాడు.