HomeTelugu news

బాగా తాగి ఉన్నాం సార్..ఏం తెలియలేదు: దిశ హత్యకేసు నిందితులు
Published By :  Divya Valluru Image Image
Disa murderers reveals shocking details about their crime
Monday Dec 02, 2019
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షాద్‌నగర్‌లో వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం కేసులో పోలీసులు నలుగురు నిందితులని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సంచలన కేసులో గుడిగండ్ల, జుక్లేర్ గ్రామాలకు చెందిన మహ్మద్ పాషా, నవీన్ కుమార్, చెన్నకేశవులు, శివలను నిందితులుగా తేల్చిన పోలీసులు వారిని విచారించి కీలక సమాచారం రాబడుతున్నారు. విచారణలో భాగంగా పోలీసులకు నిందితులు సంచలన విషయాలు వెల్లడించారు. 

"తాము లారీలోడుతో వచ్చిన తర్వాత తొండుపల్లి వద్ద ఆగాం. ఉదయం నుంచి ఖాళీగా కూర్చోవడంతో విసుగొచ్చింది. ఏదో ఒకటి చేయాలని అనుకొని ఫుల్‌గా మద్యం సేవించాం. అదే సమయంలో దిశ అటుగా వచ్చి బైక్ పార్క్ చేయడం చూశాం. ఆమె తిరిగిరాగానే అత్యాచారం చేయాలని అనుకొని ప్లాన్ వేసుకున్నాం.ఎంత ఆలస్యంగా వస్తే అంత సులభంగా తమ పని పూర్తి అవుతుందని భావించాం. చంపేసి ఆమెను కాల్చివేస్తే ఎవరికి తెలియదని అనుకున్నాం. కానీ ఇంత దూరం వస్తుందని మేం ఊహించలేదు. బాగా తాగిన మత్తులో తప్పు చేస్తున్నామనే భావన కలగలేదు’ అంటూ నిందితులు చెప్పుకొచ్చారు. వారు చెప్పిన మాటలకు పోలీసులే నిర్ఘాంత పోయారు. 

కాగా ఈ కేసుపై ఇంకా పూర్తి విచారణను పోలీసులు కొనసాగిస్తున్నారు. నిందితులను తమ కస్టడీ కోసం కోర్టును కోరే అవకాశం ఉంది. 

   Politics

   Lifestyle