HomeTelugu news

అపార్ట్మెంట్ గోడ కూలి 10 మంది మృతి
Published By :  Divya Valluru Image Image
Ten killed after apartment wall collapsed in Coimbatore due to rains
Monday Dec 02, 2019
తమిళనాడులోని కోయంబత్తూరు మెట్టుపాళ్యంలో విషాదం చోటు చేసుకుంది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ  వర్షాలకు అపార్ట్ మెంట్ గోడ కూలిపోయింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. స్థానికులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాల కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనలో ఎంత మంది చనిపోయారనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. మృతదేహాలను శిథిలాల కింద నుంచి తీసి… పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్ కు తరలించారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు తమిళనాడు అతలాకుతలమైంది. చెన్నైలోని లోతట్టు కాలనీలన్నీ జలమయమయ్యాయి. ఇళ్లలోకి మోకాళ్ల లోతు నీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్తున్నారు. చెన్నైతో పాటు తిరువల్లూరు, తూత్తుకూడి, రామనాథపురం, చెంగల్ పట్టు, కాంచీపురం, కడలూరులో స్కూళ్లు, కాలేజీలకు ఇవాళ సెలవు ప్రకటించారు. మద్రాస్ యూనివర్శిటీ, అన్నా యూనివర్శిటీల్లో ఇవ్వాల్టి పరీక్షలు వాయిదా వేశారు. మండపం సముద్రతీరంలో 6 చేపల పడవలు దెబ్బతిన్నాయి. భారీవర్షాలు కురుస్తుండడంతో రామేశ్వరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అధికారులు తమను పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. తంజావూర్లో నీటి గుంటలో పడి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

మరో రెండు రోజులపాటు రామనాథపురం, తిరునల్వేలి, తుతికోరిన్, వెల్లూర్, తిరువల్లూర్, తిరువన్నామలై జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

   Politics

   Lifestyle