HomeTelugu news

రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కిన తహసీల్దార్‌
Published By :  Lasya Raghavaraju Image Image
Tahsildar Haseena Bhi caught by ACB officials while taking 4 lks as bribe
Friday Nov 08, 2019
తెలుగు రాష్ట్రాల్లో తహసీల్దార్‌ విజయారెడ్డి సజీవ దహనం ఘటన తర్వాత రెవిన్యూ అధికారుల్లో ఎంతో కొంత మార్పు వస్తుందని జనాలు భావించారు. కానీ, అటువంటివి ఎన్ని జరిగినా మేము మారడం జరగదు అని రెవెన్యూ శాఖ వారు మరోమారు నిరూపించారు.  తహసీల్దార్ విజయ రెడ్డి ఘటన జరిగి ఇంకా వారం కూడా గడవకముందే రూ 4 లక్షలు లంచం తీసుకుంటూ కర్నూలు జిల్లా గూడురు తహసీల్దార్‌ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. 

ఓ రైతుకు సంబంధించి భూ లావాదేవీని ఆన్‌లైన్‌లో పరిష్కరించేందుకు కర్నూలు జిల్లా గూడురు తహసీల్దార్‌ హసీనాబీ రూ. 8 లక్షలు డిమాండ్‌ చేసింది. దీనికి రైతు అంగీకరించడంతో ముందుగా నాలుగు లక్షలు ఇవ్వాలని కండిషన్‌ విధించారు. దీంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ప్లాన్ ప్రకారం తహసిల్దార్ వద్ద దళారీగా పనిచేస్తున్న హుస్సేన్ కు రైతు 4 లక్షల రూపాయలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 

తహసీల్దార్‌ తీసుకోమని చెప్పినందునే నేను డబ్బులు తీసుకుంటున్నానని హుస్సేన్ అధికారులకు చెప్పాడు. 

   Politics

   Lifestyle