HomeTelugu news

పెళ్లి మండపంలో చిన్నారి కిడ్నాప్.. గొంతు కోసి హత్య
Published By :  Divya Valluru Image Image
Six year old girl killed by throat slit in Chittoor
Friday Nov 08, 2019
చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం గుట్టపాలెంలో ఓ చిన్నారి దారుణ హత్య తీవ్ర కలకలం సృష్టిస్తోంది. బంధువుల పెళ్లికి తల్లిదండ్రులతో కలిసి వచ్చిన 6 ఏళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అనంతరం గొంతు కోసి అత్యంత దారుణంగా చంపేశారు. 

వివరాల్లోకి వెళ్తే...చిత్తూరు జిల్లా కురబలకోట మండలం చేనేత నగర్‌లో ఉన్న కల్యాణ మండపంలో గురువారం రాత్రి జరిగిన ఓ పెళ్లికి చిన్నారి వర్షిత(6) కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కాసేపటికి చిన్నారి కనిపించకుండా పోయింది. దీంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు.ఎంత వెతికినా చిన్నారి ఆచూకీ లభించకపోవటంతో పోలీసులకు పిర్యాదు చేసారు. రాత్రంతా బంధువులు పరిసర ప్రాంతాల్లో వెతుకుతూనే ఉన్నారు.  ఈ క్రమంలో శుక్రవారం ఉదయం చిన్నారి మృతదేహం లభ్యమైంది. పెళ్లి జరిగిన ఫంక్షన్ హాల్‌కు సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో మృతదేహం లభించినట్టు తెలుస్తోంది.చిన్నారిని దుండగులు గొంతు కోసి దారుణంగా హతమార్చారు. అభం శుభం తెలియని పాపను చంపేసారు అంటూ చిన్నారి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు NNR కల్యాణ మండపంలో సీసీ టీవీ ఫుటేజ్ ను స్వాధీనం చేసుకున్నారు. సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. వర్షిణి హత్యకు పాతకక్షలు కారణంగా భావిస్తున్నారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పొలిసు అధికారులు తెలిపారు. 

   Politics

   Lifestyle