HomeTelugu news

టిక్ టాక్ రచ్చ...భార్యను హత్య చేసిన భర్త
Published By :  Divya Valluru Image Image
Man in Kanigiri kills his wife over TikTok Videos
Friday Nov 08, 2019
టిక్‌టాక్ కారణంగా మరో కుటుంబం చిన్నాబిన్నమైంది. భార్య వద్దన్నా టిక్‌టాక్ వీడియోలు చేస్తోంటే...ఆమెపై అనుమానం పెంచుకున్న భర్త భార్యను హత్యచేసి, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన ఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలో కలకలం రేపుతోంది.

కనిగిరి మండలం, తాళ్లూరుకు చెందిన ఫాతిమా కనిగిరిలో టైలర్ పనిచేసే పాచ్చును వివాహం చేసుకుంది. ఫాతిమాకు టిక్‌టాక్ వీడియోలు చేసే అలవాటు ఉంది. ఇది పాచ్చుకు నచ్చలేదు. దీంతో ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఫాతిమా ఎవరితోనో వివాహేతర సంబంధం పెట్టుకుంది, అందుకే ఎన్ని సార్లు చెప్పిన టిక్ టాక్ వీడియో లు చేస్తూనే ఉందనే అనుమానం పెంచుకున్న భర్త పాచ్చు చపాతీ కర్రతో ఆమెను కొట్టి చంపాడు.

ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని తన భార్య ఆత్మహత్య చేసుకుందని ఫాతిమా భర్త అందరికీ చెప్పాడు. అయితే ఫాతిమా తల్లి కూతురి మృతిపై చేసిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అసలు నిజం కనిపెట్టారు.  భార్యను చపాతి చేసే కర్రతో తలపై కొట్టి, గొంతుపై నొక్కిపట్టి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో పాచ్చు ఒప్పేసుకున్నాడు. 

   Politics

   Lifestyle