HomeTelugu news

పొడవైన క్రికెట్ అభిమానికి చేదు అనుభవం
Published By :  Lasya Raghavaraju Image Image
Eight feet tall Afghan cricket fan Sher Khan struggles to find hotel room
Thursday Nov 07, 2019
క్రికెట్ పై మక్కువతో దేశాలు దాటి మన దేశంలో అడుగుపెట్టిన ఓక అభిమానికి అనుకోని సమస్య వచ్చిపడింది. దీంతో అతను ఏమి చేయాలో తెలియక పోలీసులను ఆశ్రయిస్తే, మొదట అతని పరిస్థితి చూసి ఖంగుతిన్న వారు అతని సమస్యని తీర్చారు. 

వివరాల్లోకి వెళ్తే...ఆఫ్గనిస్తాన్ దేశానికి చెందిన షేర్‌ఖాన్‌ క్రికెట్ వీరాభిమాని. ఆప్ఘనిస్థాన్ వెస్టిండిస్ జట్ల మధ్య మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియం వేదికగా జరిగబోయే వన్డేను చూడడానికి లక్నోకు బయలుదేరి వచ్చాడు . ఎనిమిది అడుగులు రెండు అంగుళాల ఎత్తు ఉండే షేర్‌ఖాన్‌ కి లక్నో‌లో బస చేయడానికి హోటల్ గదులు దొరకలేదు. లక్నో లోని అన్ని హోటల్స్ కు షేర్‌ఖాన్‌ తిరిగాడు.  ఆయన ఎత్తునుచూసి భయపడ్డ హోటల్ నిర్వాహకులు ఆయనకు గది ఇచ్చేందుకు తిరస్కరించారు. దీనితో ఎంతో నిరాశకు గురైన షేర్‌ఖాన్‌ లక్నో పోలీసులను ఆశ్రయించాడు. దీనితో వారు ఆయనకు అతికష్టం మీద హోటల్‌ రాజ్‌ధానిలో బస ఏర్పాటు చేయించారు. 

అఫ్గనిస్తాన్‌లోని కాబూల్‌ ప్రాంతానికి చెందిన షేర్‌ఖాన్‌ ను చూడడానికి వందలాదిమంది ప్రజలు హోటల్‌ బయట కాచుకుని ఉన్నారు. షేర్‌ఖాన్‌ బయటకి రాగానే అతనితో ఫోటోలు తీసుకోవడానికి జనాలు పోటీపడ్డారు.  కాగా ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

   Politics

   Lifestyle