HomeTelugu news

ఎస్ఐ నెత్తికెక్కి కూర్చున్న వానరం
Published By :  Divya Valluru Image Image
Monkey sits on Sub Inspector's head in UP; Video goes viral
Wednesday Oct 09, 2019
పోలీసులతో మాట్లాడడానికే కొంత మంది బయపడిపోతుంటారు, కానీ ఒక కోతి ఏకంగా పోలీస్ ఇన్‌స్పెక్టర్ తలపైకి ఎక్కి దిగనంటే దిగనంటూ మొండికేసింది. ఎంతసేపటికి ఆ వానరం తలపై నుంచి దిగకుండా అలాగే కుర్చోనుండగా, ఆ ఎస్ఐ తన పని తాను చేసుకుంటూ పోయాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది. 

మంగళవారం యూపీలోని పిలిభిట్ జిల్లాలో సదార్ కొట్వాలీ పోలీస్ స్టేషన్‌ లోపలికి కోతి చొరబడింది. కిటికీలో నుంచి వచ్చిన కోతి పోలీస్ ఇన్‌స్పెక్టర్ తలపైకి ఎక్కి కూర్చుంది.  భుజాల పైకి ఎక్కి తలలో పేలు వెదుకుతూ కూర్చుంది. ఇన్‌స్పెక్టర్ తన పని తాను చేసుకుంటూ ఇక చాలు కిందకి దిగు అని అడుగుతుంటే తనకేం పట్టనట్లు కూర్చొని పేలు వెదికే పనిలో మునిగిపోయింది. ఇద్దరు పోలీసులు ఆ కోతిని కిందకు దించడానికి తంటాలు పడుతూ కనిపించారు. స్టేషన్లోని సిబ్బంది నవ్వులు వీడియోలో వినిపిస్తున్నాయి. అరటిపండు వేస్తే కోతి తప్పుకుంటుందని చెప్పడంతో వీడియో అయిపోయింది. 

ఈ వీడియోలో ఉంది శ్రీకాంత్ ద్వివేదిగా స్థానిక మీడియా చెప్పుకొచ్చింది. వీడియోను సోషల్ మీడియాలో చూసిన తర్వాత పనిలో ఉండగా రీతా, శిఖాకాయ్, షాంపోల వంటి వాటితో డిస్టర్బ్ చేసినా పని వదలకూడదని ఈ వీడియో చూశాక తెలుస్తుందని అడిషనల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ రాహుల్ శ్రీ వాస్తవ్ సెటైరికల్ ట్వీట్ చేశారు.