HomeTelugu news

సెల్ఫీలు తీసుకుంటూ డ్యాంలో పడి నలుగురు మృతి
Published By :  Divya Valluru Image Image
Four members drown in Pambaaru Dam while taking selfies
Wednesday Oct 09, 2019
తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. జలాశయం దగ్గర సెల్ఫీలు తీసుకుంటూ నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 

కృష్ణగిరి జిల్లా ఒడ్డపట్టి గ్రామానికి చెందిన సంతోష్‌ (14), స్నేహ (19), వినోద (18), నివేద (20) ఆదివారం ఊత్తంగరై సమీపంలోని పాంబారు జలాశయం అందాలు చూసేందుకు వెళ్లారు.
నలుగురు కాసేపు అక్కడ ఉత్సాహంగా గడిపి ఫోటోలు తీసుకున్నారు. గట్టుపై నిలబడి సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో పట్టుతప్పి అంతా నీటిలో పడిపోయారు. ఎవరికీ ఈత రాకపోవడంతో మునిగిపోయారు. 

నీటిలో పడిపోయి మునిగిపోతున్న వీళ్లను కాపాడేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి వారి కోసం గాలింపు చేపట్టారు. కొద్దిసేపటి తర్వాత మృతదేహాలు పైకి తేలడంతో వెలికితీసి ఒడ్డుకు తెచ్చారు.

ఎంతో ఉత్సాహంగా వచ్చిన తమ బిడ్డలు విగతజీవులుగా మారడంతో మృతుల తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. వారి ఆవేదన చూసిన స్థానికులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటన పండుగ వేళ తీవ్ర విషాదం నింపింది.