HomeTelugu news

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా దత్తాత్రేయ ప్రమాణం
Published By :  Lasya Raghavaraju Image Image
Bandaru Dattatreya sworn in as Himachal Pradesh new governor
Wednesday Sep 11, 2019
హిమాచల్ ప్రదేశ్ నూతన గవర్నర్‌గా మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఈ రోజు ఉదయం రాజ్‌భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. సిమ్లాలోని రాజ్‌భవన్‌లో  దత్తాత్రేయ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. హిమాచల్‌ ప్రదేశ్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రామ సుబ్రహ్మణ్యన్ ఆయనచే బుధవారం ప్రమాణ స్వీకారం చేయించారు. హిమాలయ సంప్రదాయ టోపీ ధరించి ఆయన ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ వేడుకలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జయరాం సింగ్ ఠాకూర్ , తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో సహా పలువురు బీజేపీ నేతలు, దత్తాత్రేయ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సుమారు 300 మంది అతిథులు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. 

రాష్ట్ర సంస్కృతిలో భాగంగా ధరించే హిమాచలీ క్యాప్‌ను సీఎం ఠాకూర్ మంగళవారం నూతన గవర్నర్‌కు అందజేసి శాలువాతో సత్కరించారు. 

   Politics

   Lifestyle