HomeTelugu news

హైడ్రామా మధ్య చింతమనేని అరెస్ట్
Published By :  Divya Valluru Image Image
Denduluru Ex MLA Chintamaneni Prabhakar arrested
Wednesday Sep 11, 2019
గత రెండు వారాలుగా అజ్ఞాతంలో ఉన్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు.  చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు ఇవాళ ఉదయం పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలలోని తన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. రెండు వారల నుంచి పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరిగిన చింతమనేని స్వయంగా దుగ్గిరాలలోని తన నివాసానికి వచ్చారు.  

తన భార్యకు అరోగ్యం సరిగ్గా లేకపోవడంతో ఆమెను చూసేందుకు చింతమనేని ఇంటికి వచ్చినట్టు సమాచారం. చింతమనేని కోసం ఎనిమిది ప్రత్యెక బృందాలతో వెదుకుతున్న పోలీసులు ఆయన ఇంటికి వచ్చిన విషయం తెలుసుకొని  ఆయనను అరెస్ట్ చేశారు. చింతమనేనిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా అక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్న ఆయన అభిమానులు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో చింతమనేని ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 

దళితులను దూషించిన కేసులో ఇప్పటికే ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు... ఆయనను అదుపులోకి తీసుకుని ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు తెలుస్తోంది.