HomeTelugu news

క్రికెటర్ షమీకి అలీపోర్ కోర్టు ఊరట
Published By :  Divya Valluru Image Image
Mohammad Shami gets relief from arrest warrant
Tuesday Sep 10, 2019
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీకి గృహ హింస కేసులో కోర్టునుంచి ఊరట లభించింది. ఇటీవల షమీపై జారీ చేసిన అరెస్ట్‌ వారెంట్‌‌పై పశ్చిమ బెంగాల్‌లోని అలీపోర్ కోర్టు స్టే విదిన్చిందని షమీ తరుపు న్యాయవాది సలీం రెహ్మాన్ తెలిపారు.తదుపరి విచారణ నవంబర్ 2న జరగనుందని లాయర్ తెలిపారు. 

గత ఏడాది షమీ భార్య హసీన్ జహాన్ అతనిపై గృహ హింస కేసు పెట్టింది. ఈ కేసు విచారణకు ఒక్కసారి కూడా హాజరు కాకపోవడంతో షమీ పై న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. విండీస్ టూర్ నుంచి తిరిగి వచ్చిన 15 రోజుల్లోపు లొంగిపోవాలంటూ కోర్టు షమీని ఆదేశించింది. వెస్టిండీస్ పర్యటనని ముగించుకున్న మహ్మద్ షమీ.. ఈనెల 12న భారత్‌కి వస్తున్నట్లు బీసీసీఐకి సమాచారం అందించాడు.

అయితే షమీ తరపు లాయర్ తన క్లయంట్ సౌత్ ఆఫ్రికా పై ఆడే జట్టులో చోటు దక్కించుకున్నాడని, అతని అరెస్ట్ వారెంట్ పై స్టే విదించాలని కోరాడు.  షమీ పై ఉన్న అరెస్ట్ వారెంట్‌పై అలీపోర్ న్యాయస్థానం స్టే విధించింది.... తదుపరి విచారణని నవంబరు 2కి వాయిదా వేసిందని లాయర్ సలీమ్ రెహ్మాన్ వెల్లడించారు.

ఇండియా తరపున షమీ 70 వన్డేలు, 42 టెస్టులు, 7 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 153, వన్డేల్లో 131,టీ20 ల్లో ఎనిమిది వెకెట్లు పడగొట్టాడు. ప్రపంచకప్ లో హ్యాట్రిక్ సాధించిన సంగతి తెలిసిందే.

   Politics

   Lifestyle